- Advertisement -
బెల్గ్రేడ్: సెర్బియా వేదికగా జరుగుతున్న ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెదిన ఆకాశ్ కుమార్ సెమీఫైనల్లో ప్రవేశించాడు. దీంతో ఈ పోటీల్లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. 54 కిలోల విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ ఆకాశ్ కుమార్ 50 తేడాతో వెనిజులాకు చెందిన యోల్ ఫినోల్ను చిత్తు చేశాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆకాశ్ అలవోక విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లాడు. ఇక సెమీస్‌లో ఓడినా అతనికి కాంస్య పతకం దక్కుతుంది. కాగా భారత బాక్సర్ శివ థాపా, నరేందర్‌లు క్వార్టర్ ఫైనల్ దశలోనే ఇంటిదారి పట్టారు.
- Advertisement -