Monday, January 20, 2025

పాత కక్షలతోనే పాతబస్తీలో కాల్పులు

- Advertisement -
- Advertisement -

హదరాబాద్: పాతబస్తీలో మంగళవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం సృష్టించాయి. పాతకక్షల నేపథ్యంలో యువకుడిని అతడి ప్రత్యర్ధులు తుపాకీతో కాల్చి చంపారు. టపాచపుత్ర పోలీసుల కథనం ప్రకారం…కార్వాన్‌కు చెందిన ఆకాష్‌సింగ్(26) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గత ఏడాది దసరా ఉత్సవాల్లో క్రాంతికుమార్ అనే వ్యక్తితో గొడవలు జరిగాయి. ఈ గొడవలో క్రాంతికుమార్, ఆశాష్ సింగ్‌పై దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రాంతికుమార్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. తనను జైలుకు పంపించిన ఆకాష్ సింగ్‌పై క్రాంతి కుమార్ కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆకాష్ సింగ్‌ను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే క్రాంతికుమార్ జైలు నుంచి విడుదలయ్యాడు.

తర్వాత మురిగి చౌకుకు చెందిన ఇమ్రాన్‌ను కలిసి తాను ఆకాష్ సింగ్‌తో రాజీ కుదుర్చుకుంటానని పిలిపించమని చెప్పాడు. ఇది నమ్మిన ఇమ్రాన్, ఆకాష్ సింగ్‌ను మంగళవారం రాత్రి తన ఇంటికి పిలిపించాడు. ఇమ్రాన్ ఇంటికి వచ్చిన ఆకాష్‌సింగ్, క్రాంతికుమార్, అతడి స్నేహితుడు చంద్రజోసి కలిసి మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలోనే క్రాంతి కుమార్, అతడి స్నేహితుడు చంద్రజోషి కలిసి కత్తులతో ఆకాష్ సింగ్‌పై దాడి చేసేందుకు యత్నించారు. వెంటనే అలర్ట్ అయిన ఆశాష్ సింగ్ అక్కడి నుంచి తప్పించుకుని బయటికి పరుగెత్తాడు. దీంతో నిందితులు తుపాకీతో కాల్పులు జరపడంతో ఆకాష్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు బిజేపి కార్వాన్ నాయకుడు అమర్ సింగ్ మేనల్లుడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కాల్పులు జరిపిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. పాతకక్షల వల్లే కాల్పులు జరిగాయని పోలీసులు నిర్దారించారు. సంఘటన స్థలంలో కత్తులు, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News