Saturday, October 5, 2024

ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’

- Advertisement -
- Advertisement -

'Aakasham Nee Haddura' has been nominated for 2021 Oscars

 

లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. లాక్‌డౌన్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. అంతేగాక ఈ సినిమాలో సూర్య హీరోయిన్ అపర్ణ బాలమురళి నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైంది. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్ర పోషించాడు. అయితే 2021 ఆస్కార్ అవార్డులకు గాను ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ పోటీలో నిలిచింది. తాజాగా ఆస్కార్ బరిలో ఈ సినిమా మూడు విభాగాలలో నెక్స్ట్ లెవెల్‌కు ఎంపికైంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో సూరరై పొట్రు(ఆకాశం నీ హద్దురా), ఉత్తమ నటుడు విభాగంలో సూర్య, ఉత్తమ నటి విభాగంలో అపర్ణ బాలమురళి ఎంపికైనట్లు ఆస్కార్ విడుదల చేసిన జాబితాలో చూడవచ్చు. దీంతో ఈ చిత్రబృందం ఎంతో ఆనందంగా ఉంది. అదృష్టం కొద్దీ ఈ సినిమాకు అవార్డు లభిస్తే మాత్రం అది పెద్ద రికార్డుగా నిలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని సూర్యనే నిర్మించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News