Thursday, January 23, 2025

ఆకాష్‌+బైజూస్‌ ప్రేరేపించే సదస్సు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో జాతీయ అగ్రగామి ఆకాష్‌ బైజూస్‌ ఓ ప్రేరణాత్మక సదస్సును ఎస్పేర్‌ యాక్ట్‌ ఎచీవ్‌ శీర్షికన భారతీయ విద్యాభవవన్‌ వద్ద ఇటీవల నిర్వహించింది. ఈ సదస్సు అత్యంత ఆహ్లాదకరమైన రీతిలో జరిగిన సత్కారంతో ప్రారంభమైంది. ఆకాష్‌ 2021 అల్యూమ్ని విద్యార్థులకు ఈ సత్కారం జరిగింది. వీరంతా కూడా పలు వైద్య, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అభ్యసిస్తున్నారు. దీనిని అనుసరించి ఎన్‌టీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సత్కారం చేశారు. విద్యార్థులు పలు ఆహ్లాదకరమైన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. వారు ప్రదర్శించిన ఆడియో, పాటలతో అలరించారు.

విద్యార్థులకు స్ఫూర్తి దాయక సందేశాలనందించడంతో పాటుగా ప్రోత్సాహకర సందేశాన్నందించిన రీజనల్‌ డైరెక్టర్‌–సౌత్‌, ధీరజ్‌ కుమార్‌ మిశ్రా గత 40 రోజులుగా నీట్‌/జెఈఈ కోసం సంసిద్ధత తమ కలలను సాకారం చేసుకోవడంలో ఏ విధంగా తోడ్పడేదీ వివరించారు. విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ కోసం ఏ విధంగా కట్టుబడి ఉండాల్సింది చెప్పిన ఆయన నిర్మాణాత్మకమార్పులు ఒకరు మరింత విజయవంతంగా మారేందుకు తోడ్పడుతుందీ వెల్లడించారు. ఈ కార్యక్రమం విద్యార్థులను సానుకూలంగా ఉండేలా స్ఫూర్తి కలిగించడంతో పాటుగా తమ కలల కెరీర్‌లను మెడికల్‌/ఇంజినీరింగ్‌ రంగాలలో ఏ విధంగా సాకారం చేసుకోవచ్చన్నదీ వెల్లడించారు.తమ లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని, తమ కలల సాకారంలో కృషి చేస్తామనే ప్రతిజ్ఞతో ఈ సదస్సు ముగిసింది.

Aakash+Byju’s hold Special meeting at Bharatiya Vidhyabhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News