Monday, January 20, 2025

ఐఓక్యూ పరీక్షల్లో సత్తా చాటిన ఆకాష్‌, బైజూస్‌ విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మరోమారు అద్భుత ఫలితాలను టెస్ట్‌ ప్రిపరేటరీ సేవల అగ్రగామి ఆకాష్‌+బైజూస్‌ విద్యార్థులు లిఖించారు. ఏకంగా 74 మంది విద్యార్థులు అస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, జూనియర్‌ సైన్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌ పరీక్షలో దక్షిణ భారతదేశం నుంచి అర్హత సాధించారు. ఈ పరీక్షను అసోసియేషన్‌ ఆఫ్‌ టీచర్స్‌ ఇన్‌ బయాలజికల్‌ సైన్సెస్‌ ఇన్‌ అసోసియేషన్‌తో కలిసి ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ టీచర్స్‌, హోమీ బాబా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ (హెచ్‌బీసీఎస్‌సీ) ఈ పరీక్షలు నిర్వహించాయి.

మొత్తంమ్మీద ఆకాష్‌+బైజూస్‌ నుంచి 28 మంది విద్యార్థులు ఐఓక్యుబీలో ఎంపిక కాగా, 11మంది ఓఐక్యుఎం, 25 మంది ఐఓక్యుజెఎస్‌లో ఎంపికయ్యారు. ఆకాష్‌+బైజూస్‌ నుంచి 5గురు విద్యార్థులు ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌ ఇన్‌ కెమిస్ట్రీ (ఐఓక్యుసీ), ఇండియన్‌ ఒలింపియాడ్‌ క్వాలిఫయర్‌ ఇన్‌ ఫిజిక్స్‌ (ఐఓక్యుపీ)లో 5గురు విద్యార్ధులు ఎంపికయ్యారు. ఈ సంవత్సరం భారతదేశ వ్యాప్తంగా పలు ఐఓక్యులలో 569 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

ఈ అద్భుత ఫలితాల పట్ల ఆకాష్‌+బైజూస్‌ రీజనల్‌ డైరెక్టర్‌ ధీరజ్‌ కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ.. ‘‘ఐఓక్యు పరీక్షలు 2022 ను అధిగమించిన మా విద్యార్ధుల పట్ల గర్వంగా ఉన్నాము. వారి నీట్‌/జెఈఈ కలల సాకారానికి విప్లవాత్మక ముందడుగుగా నిలుస్తుంది. విద్యార్థులకు పూర్తి మద్దతునందించిన తల్లిదండ్రులకు ధన్యవాదములు తెలుపుతున్నాము. మా విద్యార్థులు, ఫ్యాకల్టీ కష్టంతో పాటుగా ఇనిస్టిట్యూట్‌ అందించిన నాణ్యత బోధన కారణంగానే ఈ విజయం సాధ్యమైంది’’ అని అన్నారు.

Aakash+BYJU’s Students qualified in IOQ Test 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News