Monday, December 23, 2024

నోరు విప్పిన నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య ఆలియా!

- Advertisement -
- Advertisement -

ముంబై: కుటుంబ కలహాల కారణంగా నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నుంచి అతడి భార్య ఆలియా సిద్ధిఖీ విడిపోయింది. కానీ ఇన్నాళ్లకు ఆమె తన బాధల గురించి నోరు విప్పింది. ఆమె ఒక ఇంటర్వూలో ఏమందంటే….నేనిన్నాళ్లు నా వ్యక్తిగత సమస్యలను గురించి పబ్లిక్‌గా మాట్లాడలేదు. నా సమస్యలు నన్ను ఎంతగానో ఉక్కిరిబిక్కిరి చేశాయి.

తన కెరీర్ కూడా దెబ్బ తిన్నదని, తనను పనిచేయనివ్వలేదని చెప్పుకొచ్చింది. నవాజుద్దీన్, ఆలియాకు కూతురు షోరా(13), కొడుకు యానీ సిద్ధిఖీ(7) ఉన్నారు.నవాజుద్దీన్ తల్లి తనను ఎంతగానో బాధించిందని, తన పిల్లలు నవాజుద్దీన్ పిల్లలే కాదందని ఆలియా తెలిపింది. ఏప్రిల్‌లో కోర్టు వారి పిల్లలను చదువుల కోసం దుబాయ్ పంపించమంది. వారివద్దకు నవాజుద్దీన్, ఆలియా వెళ్లాలని కూడా ఆదేశించింది. అప్పటికే భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా ఘర్షణ పడుతూ వచ్చారు.

ఆలియా ఇటీవల న్యూస్ 18 ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ‘ సమస్యలతో నేనెంతగానో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. అందుకే నా సమస్యలపై పబ్లిక్‌గా మాట్లాడాల్సి వచ్చింది. కోర్టు తీర్పుతో నేనిప్పుడు కాస్త కుదుటపడ్డాను. నా మనస్సెంతగా దెబ్బతిన్నదో నాకిప్పుడు అర్థమవుతోంది. కలతలో ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత విషయాలు పబ్లిక్‌గా మాట్లాడుతున్నాడంటే ఎంత క్షోభపడి ఉంటాడో ఊహించుకోండి. నేనిప్పటికీ పబ్లిక్‌గా మాట్లాడి ఉండకూడదనుకుంటున్నాను. మీరు తీవ్ర సమస్యల్లో కూరుకుపోయి ఉంటే, మీ గురించి ఎవరూ పట్టించుకోకుంటే, మీరు పోరాడకతప్పదు’ అని ఆలియా తెలిపింది.

‘నేను తీవ్ర బాధల్లో ఉన్నప్పుడు పబ్లిక్ ప్లాట్ ఫారమ్ ను ఎంచుకున్నాను. నా సమస్యలు మీడియా అర్థం చేసుకుంటుందని భావించాను. నిజంగా నేను చాలా క్షోభపడ్డాను. గత 12 ఏళ్లుగా నాలో నేను ఆవేదనకు గురవుతున్నాను. నా కెరీర్ కూడా దెబ్బతిన్నది. నన్ను పనిచేయనివ్వలేదు. నా కెరీర్ ఎదగకుండా నన్ను తొక్కేశారు’ అని ఆలియా తెలిపింది.

తన ఇటీవలి ప్రొడక్షన్ ‘హోలి కౌ ’లో పనిచేయడానికి అనుమతించినందుకు ఆలియా, నవాజుద్దీన్ సిద్ధిఖీకి కృతజ్ఞతలు తెలిపింది. ఆ సినిమాలో సంజయ్ మిశ్రా నటించాడు. దానికి సాయి కబీర్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా గత ఏడాది ఆగస్టులో విడుదలయింది. ఈ వారం ప్రైమ్ వీడియోలో విడుదలయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News