Sunday, January 19, 2025

కేరళ పార్టీతో ఆప్ పొత్తు…. పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ ప్రకటన

- Advertisement -
- Advertisement -

Aam Aadmi Party alliance with Twenty20 party

 

తిరువనంతపురం : ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) దక్షిణాదిలో అడుగుపెట్టడంపై దృష్టి కేంద్రీకరించింది. కేరళలోని ట్వంటీ20 పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదివారం కొచ్చీని సందర్శించారు. ట్వంటీ 20 పార్టీతో కలిసి పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ ను ప్రకటించారు. ఇప్పుడు కేరళలో నాలుగు రాజకీయ కూటములు ఉన్నాయన్నారు. ఎల్డీఎఫ్, యూడిఎఫ్, ఎన్డీయేతోపాటు తమ కూటమి పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ కూడా ఉందని చెప్పారు. అభివృద్ధి కావాలంటే తమ పార్టీ వద్దకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేరళలో తమ పార్టీ అధికారం లోకి వస్తే ఢిల్లీ మాదిరిగా అభివృద్ది చేస్తామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News