Thursday, January 23, 2025

తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ శర వేగంగా విస్తరిస్తోందని, తెలంగాణ రాష్ట్రంలోనూ నానాటికి పార్టీ బలపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి సుధాకర్ అన్నారు. అవినీతి, నేరపూరిత, మతపరమైన స్వభావాలతో ప్రజలు విసిగిపోయారని, నిజాయితీ, ప్రత్యామ్నాయ రాజకీయాల ఆలోచనతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్, లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలోఎఐటియుసి ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ మాజీ నాయకులూ రుద్రాక్ష మల్లేష్ నేతృత్వంలో సలాఉద్దీన్, ఆనంద్, ఎండి. ఫరూక్ లతోపాటు పలువురు నాయకులు డాక్టర్ దిడ్డి సుధాకర్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ లో చేరారు. డాక్టర్ సుధాకర్ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఆప్‌కు అనుబంధంగా కొత్తగా ఆటో డ్రైవర్స్ యూనియన్ ను డా. సుధాకర్ ప్రారంభించి మాట్లాడారు.

బిజెపి ప్రజా వ్యతరేక విధానాలు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని, ప్రజలు జీవించిలేని స్థితిలోకి నెట్టివేశాయని, ఆయన విమర్శించారు. రోజువారీ జీవితం, జీవనోపాధిపై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తూ ఢిల్లీలోలాగా సంక్షిప్త పాలన కోరుకుంటున్నారని తెలిపారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో పంజాబ్ లో విజయం సాధించి కొన్ని రాష్ట్రాల్లో ఎమ్యెల్యేలు గా గెలవడంతో ఓట్ల శాతం పెరిగి ఆమ్ ఆద్మీ పార్టీ కి జాతీయ పార్టీగా హోదా లభించిందని అయన గుర్తు చేసారు. ఇది దేశ ప్రజలకు బిజెపి ఆధిపత్యాన్ని సవాలు చేయగల పార్టీ ఆప్ ఒక్కటే అనే ఆశను రేకెత్తించేలా చేసిందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా నిలుస్తూ, రోడ్లు, ఉచిత విద్యుత్, నీరు, ఆరోగ్యం మరియు విద్య అందిస్తున్న ఆప్ ప్రభుత్వాలను చూసి దేశ ప్రజలు ఇది ప్రజల సమస్యలను పరిష్కరించే రాజకీయ పార్టీగా స్వాగతిస్తున్నారన్నారని సుధాకర్ చెప్పారు. తెలంగాణ అంతటా బలమైన పార్టీ నిర్మాణాన్ని చేపడుతున్నామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సత్తా చాటుతుందని అయన స్పష్టం చేశారు.

స్వచ్ఛ రాజకీయాలను కోరుకునే సామాన్య పౌరులకు ఆప్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని డాక్టర్ సుధాకర్ అన్నారు. రుద్రాక్ష మల్లేష్ మాట్లాడుతూ దేశభక్తి, నిజాయితీ, మానవత్వం తో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితునై ఆప్ లో చేరానని తెలిపారు. ఆప్ బలోపితానికి కృషి చేస్తూ, సారథ్యంలో ఆటో రంగ కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తానని అన్నారు. ఆప్ తెలంగాణ ప్రొఫెషనల్ కమిటీ కన్వీనర్ జి. హరి చరణ్, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఎండి. మజీద్, డా. పుట్ట పాండు రంగయ్య నేతలు ఆఫ్జల్, జావేద్ షరీఫ్, ఫణి భూషణ్, సోహైల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News