Wednesday, January 22, 2025

5 రాష్ట్రాలలో కాంగ్రెస్‌తో పొత్తు

- Advertisement -
- Advertisement -

చర్చలపై ఆప్ స్పష్టత

న్యూఢిల్లీ: పంజాబ్‌తోసహా ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలన్న వైఖరికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కట్టుబడి ఉందని, ఇప్పటివరకు జరిగిన చర్చలు సానుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ మంగళవారం తెలిపారు. ఆప్, కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమిలో భాగంగా ఉన్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై రెండు పార్టీలు సోమవారం చర్చలు జరిపాయి.

రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు ప్రారంభమయ్యాయని, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గోవా, గుజరాత్‌లో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేయాలన్న వైఖరికి తమ పార్టీ కట్టుబడి ఉందని విలేకరుల సమావేశంలో గోపాల్ రాయ్ తెలిపాయి. ఆప్ పోటీ చేసే సీట్ల గురించి ప్రశ్నించగా ఈ రాష్ట్రాలలో నిర్దిష్టంగా ఏఏ సీట్లలో పోటీచేయాలన్న దానిపై చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ అధికారంలో ఉంది. అయితే ఈ రెండు రాష్ట్రాలలో ఆప్‌తో ఎన్నికల పొత్తును కాంగ్రెస్ రాష్ట్ర శాఖలు వ్యతిరేకిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News