Thursday, January 23, 2025

అయ్యబాబోయ్.. అమీర్ ఖాన్ ఇలా ఉన్నాడేంటీ?

- Advertisement -
- Advertisement -

వెండితెరపై ప్రయోగాలు చేయడంలో ఆమిర్ ఖాన్ తర్వాతే ఎవరైనా! తాజాగా ఆమీర్ ఖాన్ ఫోటో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. ఆ ఫోటో చూస్తే అందులో ఉన్నది అమీర్ ఖాన్ అంటే ఎవరూ నమ్మలేరు. అంతగా డిఫరెంట్ గా ఉంది ఆ ఫోటో. పొడవైన జుట్టు, గడ్డం, చింతనిప్పుల్లాంటి కళ్లు… పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చే అవతారం! ఫోటోని బట్టి చూస్తే ఆమిర్ నటిస్తున్న తాజా చిత్రం తాలూకు స్టిల్ అని తెలుస్తూనే ఉంది. ఇంత డిఫరెంట్ గెటప్ లో అమిర్ ఖాన్ నటిస్తున్న ఆ మూవీ తాలుకు విశేషాల కోసం అభిమానులు నెట్లో తెగ వెతుకుతున్నారట.

అమీర్ ఖాన్ వెండితెరపై కనిపించి ఏడాదిన్నర అవుతోంది. అతను చివరిగా నటించిన మూవీ లాల్ సింగ్ చద్దా. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అనుకున్న వసూళ్లను రాబట్టలేకపోవడంతో అప్ సెట్ అయిన అమీర్.. మూవీలనుంచి కాస్త విరామం తీసుకున్నాడు. ఒకప్పుడు తనతో తారే జమీన్ పర్ మూవీలో కలసి నటించిన దర్షీల్ సఫారీతో కలసి కొత్త మూవీ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీని పేరు సితారే జమీన్ పర్.  ఈ స్టిల్ అందులోదే కావచ్చు మరి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News