Wednesday, January 22, 2025

చెన్నై వరదల్లో చిక్కుకున్న అమీర్ఖాన్..

- Advertisement -
- Advertisement -

తమిళనాడును భారీ వరదలు ముంచెత్తున్నాయి. ఇళ్లల్లోకి వరదలు నీళ్లు క్రమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్య ప్రజలతోపాటు సినీ సెలబ్రెటీస్ కూడా ఈ వరదల్లో చిక్కుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా చెన్నై వరదల్లో ఇరుక్కుపోయారు. దీంతో ఆయనను రెస్క్యూ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. చెన్పైలోని కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ నివాసంలో అమీర్ ఖాన్ ఉండగా.. భారీ వర్షాలకు వరద నీరు ఇళ్లల్లోకి వచ్చింది. బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విశాల్ తన ఇంటి మేడపైకి వెళ్లి అక్కడి పరిస్థతిని సోషల్ మీడియాలో వివరిస్తూ పోస్ట్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వారి వద్దకు రెస్క్యూ సిబ్బందిని పంపించి సహాయం చేశారు. రెస్క్యూ సిబ్బంది వారుండే ప్రాంతానికి చేరుకు విశాల్, అమీర్ ఖాన్ తోపాటు వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటన అనంతరం విశాల్, అమీర్ ఖాన్ లు.. హీరో అజిత్ ను కలిశారు.ఈ సందర్భంగా దిగిన ఫోటోను విశాల్ సోషల్ మీడియాలో చేస్తూ లవ్ యూ సర్ అని షేర్ చేశాడు.

కాగా సోమవారం నుంచి చెన్నై, దాని చుట్టుపక్కల జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News