Saturday, December 21, 2024

హైదరాబాద్‌లో ఆమిర్ ఖాన్.. నేరుగా అల్లు అర్జున్ ఇంటికి(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రస్తుతం నటనకు బ్రేక్ ఇచ్చిన బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆమిర్ ఖాన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా..ఆమిర్ ఖాన్‌ను పికప్ చేసుకోవడానికి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సొంత కారును ఎయిర్‌పోర్టుకు పంపించినట్లు వార్తలు వినవచ్చాయి. ఆమిర్‌కు రక్షణగా తన వ్యక్తిగత బాడీగార్డులను కూడా అల్లు అర్జున్ ఎయిర్‌పోర్టుకు పంపడం, అల్లు అర్జున్ పంపిన కారులో ఆమిర్ ఖాన్ బయల్దేరడం అభిమానులను సైతం ఆశ్చర్యానికి లోనుచేస్తోంది.

జుబిలీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసానికి ఆమిర్ ఖాన్ బయల్దేరి వెళ్లడంపై అభిమానులలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు నటులు ఏదైనా ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారా అన్న ఊహాగానాలు జోరందుకుటున్నాయి. ఇక ప్రొఫెషనల్ విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ప్రాజెక్టులో బిజీగా ఉండగా తన తాజా చిత్రం లాల్ సింగ్ ఛద్దా ఘోరంగా ఫెయిల్ కావడంతో ఆమిర్ ఖాన్ నటనకు తాత్కాలికంగా విరామమిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News