బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు కోకొల్లలుగా ఉంటారు. ఆయన సినిమా విడుదల అయిందంటే.. ఫ్యాన్స్‌కి అది పండుగే.. అయితే అమీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా పివిఆర్ ఐనాక్స్ ‘అమీర్ ఖాన్ : సినిమా కా జాదూగర్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అమీర్ తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తిక విషయాలను వెల్లడించారు.
కెరీర్ ఆరంభంలో ఆయన నటించిన సినిమా ఒకటి భారీ విజయం సాధించడంతో తనకు 300-400 సినిమా ఆఫర్లు వచ్చాయని ఆయన తెలిపారు. అందులో ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో తెలికపోయేదని.. దీంతో ఒక్కసారిగా చాలా సినిమాలకు సంతకం చేసేవాడనని వెల్లడించారు. అప్పట్లో కొందరు హీరోలు ఒకేసారి 50 సినిమాల్లో నటించేవారని.. అది చూసి తాను కూడా 10 సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే తాను కోరుకున్న దర్శకుల నుంచి అవకాశాలు రాలేదని.. కానీ, ఒప్పుకున్న సినిమాల కోసం మూడు షిఫ్టును పని చేసి ఒత్తిడి వల్ల ఇంటికి వెళ్లి ఏడ్చే వాడినని ఆయన తెలిపారు.