Thursday, January 23, 2025

కాంగ్రెస్‌పై ఇసికి ఆమిర్ ఖాన్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

ముంబై: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నకిలీ ప్రచార ప్రకటనపై ప్రముఖ సినీనటుడు ఆమిర్ ఖాన్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కృత్రిమ మేధ(ఎఐ) ద్వారా సృష్టించిన తన డీప్ ఫేక్ వీడియోను ఈ యాడ్‌లో ఉపయోగించారని ఆమిర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామన్న వాగ్దానం ఏమైందంటూ అధికార బిజెపిని ఈ ఆమిర్ ఖాన్ ప్రశ్నించడం ఈ వీడియోలో కనిపించింది.

అయితే గ10 సంవత్సరాల క్రితం తాను నిర్వహించిన సత్యమేవ జయతే అనే టివి షోకు చెందిన ఎపిసోడ్‌ను ఎఐ ద్వారా డీప్ ఫేక్ వీడియో తీసి ఈ యాడ్‌లో వాడుకున్నారని ఆమిర్ ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమిర్ ఖాన్ దీనిపై న్యాయపరమైన చర్యలు చేపట్టారని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లారని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. తన 35 ఏళ్ల సినీ జీవితంలో ఆమిర్ ఖాన్ ఎన్నడూ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు.

గత ఎన్నికలలో ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి ఆయన ప్రచారాన్ని చేశారని తెలిపారు. ఒక రాజకీయ పార్టీకి మద్దతిస్తూ వైరల్ అయిన వీడియో పట్ల తాము ఆందోళన చెందామని ఆయన చెప్పారు. ఇది పూర్తిగా నకిలీ వీడియో అని ఆయన స్పష్టం చేశారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని ఆయన చెప్పారు. ముంబై పోలీసుకు చెందిన సైబర్ క్రైమ్ సెల్‌లో ఫిర్యాదు చేయడంతోసహా అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని ఆయన చెప్పారు. ప్రజలందరూ ఓటు వేసి ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని ఆమిర్ ఖాన్ ప్రజలకు విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News