Thursday, January 23, 2025

‘దంగల్’లో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన సుహానీ మృతి

- Advertisement -
- Advertisement -

సూపర్ హిట్ మూవీ ‘దంగల్’లో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన సుహానీ భట్నాగర్ కన్నుమూసింది. ఆమె వయసు కేవలం 19 ఏళ్లు. ఈ వార్త బాలీవుడ్ ను కుదిపివేస్తోంది. నెట్ లో సుహానీకి నివాళులు వెల్లువెత్తుతున్నాయి.   దంగల్ లో ఆమె చిన్నప్పటి బబితా ఫోగట్ గా నటించింది.

కొన్ని రోజుల క్రితం సుహానీ కాలు విరిగింది. అందుకోసం ఆమె వాడిన టాబ్లెట్లు వికటించి, ఆమె శరీరంలో ఒక రకమైన ద్రవం పేరుకుపోయింది. ఆమెను ఢిల్లీలోని ఆలిండియా మెడికల్ సైన్సెస్ ఇన్ స్టిట్యూట్ లో చేర్చించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసింది. సుహానీ అంత్యక్రియలు ఫరిదాబాద్ లో జరగనున్నాయి.

ప్రముఖ మాజీ రెజ్లర్ మహావీర్ ఫోగట్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన దంగల్ మూవీలో అమీర్ ఖాన్, సుహానీ భట్నాగర్ తోపాటు ఫాతిమా సనాఖాన్, జైరా వాసిమ్, సాక్షి తన్వర్ తదితరులు నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News