Sunday, September 8, 2024

లక్షల్లో ఇన్‌స్టా ఫాలోవర్లు..జలపాతం వద్ద రీల్స్ చేస్తూ యువతి మృతి

- Advertisement -
- Advertisement -

సామాజిక మాధ్యమాల్లో రీల్‌లే ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ అవగాహన వీడియోలు చేస్తున్న ఆమెను చివరకు అవే ప్రాణాలు తీశాయి. కుంబే జలపాతం వద్ద రీల్ చేస్తుండగా, జారిపడి ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. పోలీస్‌ల వివరాల ప్రకారం … అన్వే కామ్‌దార్ (26) ముంబైలో నివాసం ఉంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందారు. ఏడుగురు మిత్రులతో కలిసి మంగళవారం (జులై 16) మహారాష్ట్ర లోని రాయ్‌గఢ్ సమీపంలో ఉన్న కుంబే జలపాతాన్ని సందర్శించారు. ప్రకృతి అందాల మధ్య ఉన్న ఆ జలపాతాల సోయగాన్ని రీల్‌లో బంధించడానికి సిద్ధమయ్యారు. అక్కడే ఓ లోయకు అంచుకు వెళ్లి నిలబడగా, ఆమె స్నేహితులు వీడియో రికార్డు చేయడం మొదలుపెట్టారు.

అయితే దురదృష్టవశాత్తు ఆమె కాలు జారీ లోయలోకి పడిపోయారు. తాను నిలుచున్న ప్రాంతం చిత్తడిగా ఉండడం వల్లనే కాలుజారి 300 అడుగుల లోయలో పడ్డారు. ఉదయం 10.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. స్థానికులు వెంటనే పోలీస్‌లు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆరు గంటల పాటు శ్రమించి ఆమెను వారు బయటకు తీయగలిగారు. కానీ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఆన్వీకి ఇన్‌స్టాలో 2.56 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె చేసిన పోస్ట్‌లకు మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్నాయి. దేశ విదేశాల్లో అనేక ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడి విశేషాలను పంచుకుంటూ తన ఫాలోవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఆమె వృత్తి రీత్యా ఛార్టెర్డ్ అకౌంటెంట్. డెలాయిట్‌లో పనిచేశారు. న్‌స్టా బయోలో ఆమె తనని తాను ట్రావెల్ డిటెక్టివ్‌గా రాసుకున్నారు. ముఖ్యంగా మాన్‌సూన్ టూరిజంపై తీసిన వీడియోలే ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News