Wednesday, January 22, 2025

పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ చూపిన ఎఎఓ

- Advertisement -
- Advertisement -

అభినందించిన రాచకొండ సిపి డిఎస్ చౌహాన్

మనతెలంగాణ, సిటిబ్యూరోః పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ చూపిన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అభినందించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రదీప్‌కుమార్ ఈ నెల 26వ తేదీన రవీంద్రభారతి హైదరాబాద్‌లో నిర్వహించిన గోల్డ్‌మెడల్ గెల్చుకున్నాడు. ఈ పోటీల్లో 83 కిలోల కేటగిరిలో 402.5కిలోల బరువు ఎత్తి మొదటి స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అభిలభారత పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్‌ను నేరడ్‌మెట్‌లోని కార్యాలయంలో సోమవారం కలిశారు. ప్రదీప్‌కుమార్‌ను సిపి డిఎస్ చౌహాన్ అభినందించి, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News