Saturday, October 26, 2024

కేజ్రీవాల్ హత్యకు ‘కుట్ర’

- Advertisement -
- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ హత్యకు ‘ప్రగాఢ కుట్ర’ జరుగుతోందని ఆప్ శనివారం ఆరోపించింది. ఆయనకు ఏదైనా జరిగితే బిజెపిదే బాధ్యత అవుతుందని ఆప్ హెచ్చరించింది. పశ్చిమ ఢిల్లీ వికాస్‌పురిలో కేజ్రీవాల్ ‘పాదయాత్ర’ కార్యక్రమంలో ఆయనపై ‘బిజెపి గూండాలు’ దాడి జరిపారని ఆప్ నాయకులు శుక్రవారం ఆరోపించారు. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, ‘ఈ సంఘటనలో పోలీసులు కుమ్మక్కు కావడం కేజ్రీవాల్ హత్యకు ప్రగాఢ కుట్ర జరుగుతోందని స్పష్టంగా సూచిస్తోంది. బిజెపి ఆయన పాలిట శత్రువు అయింది’ అని ఆరోపించారు.

సంజయ్ సింగ్ ఆరోపణలపై పోలీసుల నుంచి గాని, బిజెపి నుంచి గాని వెంటనే ఎటువంటి స్పందనా రాలేదు. అయితే, వికాస్‌పురిలో ఆ సంఘటన జరిగినప్పటికీ కేజ్రీవాల్ ముందు నిర్ణయించిన కార్యక్రమం ప్రకారమే పాదయాత్ర చేపడతారని సంజయ్ సింగ్ తెలియజేశారు. ఆ సంఘటనపై ఎటువంటి ఫిర్యాదూ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించినప్పుడు పోలీసులు ‘నిష్పాక్షికత ఉన్నవారు’ అయితే ఆ సంఘటన జరిగి ఉండేది కాదని, దుండగుల గుంపును నిలువరించడానికి పోలీస్ అధికారులు ఏ చర్యా తీసుకోలేదని సంజయ్ సింగ్ సమాధానం ఇచ్చారు. ఆ దుండగులు బిజెపికి చెందినవారని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News