- Advertisement -
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభలో తమ పార్టీ నాయకుడిగా సంజయ్ సింగ్ స్థానంలో రాఘవ్ చద్దాను నియమించింది. ఆరోగ్య సమస్యలతో బాధనపడుతున్న సంజయ్ సింగ్ అందుబాటులో లేని కారణంగా ఇప్పటినుంచి ఆయన స్థానంలో రాజ్యసభలో తమ పార్టీ నాయకుడిగా రాఘవ్ చద్దా ఉంటారని రాజ్యసభ చైర్మన్‌కు రాసిన లేఖలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలియజేసింది. లిక్కర్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
రాజ్యసభలో తమ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా రాఘవ్ చద్దా నియామకానికి సంబంధించి ఆమ్ ఆప్‌నుంచి లేఖ అందినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. దీన్ని అమలు చేయడం కోసం ఈ లేఖను రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు పంపించారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 10 మంది ఎంపిలున్నారు. బిజెపి, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తర్వాత సభలో ఆమ్ ఆద్మీ పార్టీయే అతిపెద్ద పార్టీ.
- Advertisement -