Saturday, November 16, 2024

డంపింగ్‌యార్డుకు చేరిన ఆప్, బీజేపీ రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

Priyanka Gandhi emotional post on Sonia Gandhi

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆప్, బీజేపీ మధ్య తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. విజయం కోసం ఇరు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో గాజీపూర్ లోని చెత్తదిబ్బ రెండు పార్టీల మధ్య ఘర్షణకు దారి తీసింది. అక్కడి చెత్త డంపింగ్ యార్డ్ వద్దకు గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లగా బీజేపీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆయనొక అబద్ధాల కోరు అంటూ నినాదాలు చేశారు. అందుకు కౌంటర్‌గా ఆప్ కార్యకర్తలు స్పందించారు. ఇటీవల మూడు స్థానిక సంస్థల విలీనానికి ముందు పదేళ్లకు పైగా ఎంసీడీ అధికారం బీజేపీ చేతిలోనే ఉంది. దీనిని ఉద్దేశించి ఆప్ విమర్శలు చేసింది. బీజేపీ విమర్శల్లో ఎలాంటి లాజిక్ లేదు. బీజేపీ నేతృత్వంలోని స్థానిక సంస్థలు ఏం చేశాయో తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. ఢిల్లీని శుభ్రంగా ఉంచే పనిలో కమలం పార్టీ విఫలమైంది. మేం నిర్మించిన పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లను చూసేందుకు బీజేపీ వస్తే, మేం ఇలా ఆందోళన చేపట్టం. ఒకసారి ఆ పార్టీ ఓటర్లు తమ సొంతపార్టీ గురించి మర్చిపోవాలి. మేం అధికారంలోకి వస్తే ఢిల్లీని శుభ్రం చేస్తాం. మిమ్మల్ని తీర్ధయాత్రలకు తీసుకెళ్లిన కుమారుడికి ఓటు వేయాలని ఢిల్లీలోని మాతృమూర్తులకు చెప్పాలనుకుంటున్నాను’ అని వెల్లడించారు.

ఈ సందర్భంగా రామాయణంలోని శ్రవణ కుమారుడి పాత్రతో తనను తాను పోల్చుకున్నారు. బీజేపీ మాత్రం కేజ్రీవాల్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఆప్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు తగిన నిధులు ఇవ్వలేదని నిందించింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు ప్రతిజ్ఞలు చేస్తోందని మండిపడింది. అయితే ఆ ఎన్నిక తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గణాంకాల ప్రకారం నగరంలో నిత్యం 11 వేల టన్నుల ఘన వ్యర్ధాలు వస్తున్నాయి. వాటిలో 5 వేల టన్నులు ప్రాసెస్‌కు పంపగా మరో ఆరు వేల టన్నులు అక్కడి మూడు డంపింగ్ యార్డులకు చేరుకుంటున్నాయి.

AAP- BJP Clash at Ghazipur Garbage in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News