Sunday, January 19, 2025

ఢిల్లీ విలన్ బిజెపి నేతనే

- Advertisement -
- Advertisement -

AAP blamed the BJP for Jahangirpur riots

జహంగీర్‌పురి ఘటనలపై ఆప్

న్యూఢిల్లీ : స్థానిక జహంగీర్‌పురి ఘర్షణలకు బిజెపిదే బాధ్యత అని ఆమ్ ఆద్మీపార్టీ విమర్శించింది. హనుమజ్జయంతి నాడు జరిగిన ఘటనలలలో ప్రధాన నిందితుడు అయిన అన్సార్ బిజెపి నేత అని ఆప్ ఎమ్మెల్యే అతిషి తెలిపారు. బిజెపి అభ్యర్థి సంగీతా బజాజ్ పోటీకి వీలు కల్పించేందుకు, బిజెపిలో సంగీతకు ప్రాధాన్యత దక్కేలా చేయడం కోసం అత్యంత వ్యూహాత్మకంగా ఘర్షణలు రెచ్చగొట్టారని విమర్శించారు. బిజెపి గూండాలు దొమ్మికారుల పార్టీ అని మండిపడ్డారు. బిజెపి వెంటనే ఢిల్లీవాలాలకు తమ క్షమాపణ తెలియచేయాల్సి ఉందన్నారు. ఇటీవలి ఢిల్లీ ఘర్షణలకు బాధ్యులుగా అనుమానిస్తూ ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. విహెచ్‌పికి చెందిన ఇద్దరి పేర్లు , భజ్‌రంగ్ దళ్ కార్యకర్తలపై అభియోగాలను నమోదు చేశారని ఆప్ ఎమ్మెల్యే గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News