Friday, December 20, 2024

నామినేషన్ తిరస్కరణ… ఆప్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

AAP candidate attempts self-immolation over rejection of nomination

 

లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ముజఫర్ నగర్ జిల్లా లోని మీరాన్‌పూర్ నియోజక వర్గం నుంచి ఆమ్‌ఆద్మీ పార్టీ తరఫున జోగిందర్ సింగ్ అనే అభ్యర్థి పోటీ చేస్తున్నారు. దీంతో అతను తన నామినేషన్ పత్రాలను సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అయితే నామినేషన్ పత్రాల్లో కొన్ని తప్పులు దొర్లడంతో ఎన్నికల అధికారి తిరస్కరించారు. ఈ క్రమంలో జోగిందర్ సింగ్ ఆ కార్యాలయం ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. అనంతరం జోగిందర్ సింగ్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగాడు. నామినేషన్ పత్రంలో తప్పులు సరిదిద్దుకునేందుకు కూడా ఎన్నికల అధికారి తనకు సమయం ఇవ్వలేదని ఆరోపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News