Monday, December 23, 2024

ఢిల్లీ మేయర్‌గా ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయర్‌గా ఎన్నికయ్యారు. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు లేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో బుధవారం ఢిల్లీ మేయర్ పదవికి ఎన్నికలు జరిగాయి. షెల్లీ ఒబెరాయ్‌కు 150 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు లభించాయి. షెల్లీ ఒబెరాయ్‌ను అభినందించిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గూండాలు ఓడారు..ప్రజలు గెలిచారు అంటూ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News