Thursday, January 16, 2025

ఢిల్లీ ఎన్నికలకు ఆప్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్ పోటీ
‘సిఎం అభ్యర్థి లేని బిజెపి’
ఆప్ అధిపతి విమర్శ

న్యూఢిల్లీ : ఢిల్లీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ అభ్యర్థుల తుది జాబితాను ఆదివారం విడుదల చేసింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న ఆప్ అధిపతి అర్వింద్ కేజ్రీవాల్ బిజెపి విమర్శనాస్త్రాలు సంధించారు. కాషాయ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి లేరని ఆయన ఆరోపించారు. ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ విడుదల చేసిన తుది జాబితాలో 38 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆతిశీ మళ్లీ కల్కాజీ నుంచి పోటీ చేయనున్నారు. ‘పార్టీ పూర్తి విశ్వాసంతో, పూర్తి సన్నద్ధతతో ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

బిజెపి అదృశ్యమైంది., వారికి సిఎం అభ్యర్థి లేరు, జట్టు లేదు, వ్యూహ రచన లేదు, ఢిల్లీ కోసం లక్షం లేదు. వారికి ఒకే ఒక నినాదం, ఒకే ఒక విధానం, ఒకే ఒక లక్షం ఉన్నాయి ‘కేజ్రీవాల్‌ను తొలగించండి’. ఐదు సంవత్సరాల్లో ఏమి చేశారో వారిని అడగండి, వారి సమాధానం ‘కేజ్రీవాల్‌ను ఎంతగానో శపించాం’ అని కేజ్రీవాల్ హిందీలో ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. కాగా, తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించవలసి ఉన్న బిజెపి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ శర్మను న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌కు ప్రత్యర్థిగా దింపాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్ 21 మంది అభ్యర్థుల పేర్తను ప్రకటించింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి దివంగత షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌ను ఢీకొననున్నారు. ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తి లేదని కేజ్రీవాల్ అనేక సందర్బాల్లో స్పష్టం చేశారు. దేశ రాజధానిలో వరుసగా మూడవ విడత అధికారం కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్న ఆప్ తమ సీనియర్ నేతలను వారి వారి సొంత నియోజకవర్గాల్లో నామినేట్ చేసింది. కాగా, రానున్న ఎన్నికలు ఆప్ పాలన నమూనాకు, వోటర్లపై పార్టీ ప్రభావానికి అగ్ని పరీక్ష కాగలవు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News