- Advertisement -
న్యూఢిల్లీ : ఉద్యోగులు, అధికారుల నియామకాలు, బదిలీలపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ఆప్ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు (మంగళవారం) విచారణకు చేపడుతుంది. ఢిల్లీలోని మొత్తం బ్యూరోక్రసీని తన అదుపులోకి తెచ్చుకుంటూ కేంద్ర ప్రభుత్వం వెలువరించిన ఆదేశాలను ఆప్ న్యాయస్థానంలో సవాలు చేసింది. శాంతిభద్రతల విషయాలు తప్పితే మిగిలిన అధికార యంత్రాంగం
సంబంధిత విషయాలపై అధికారం కేవలం ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటుందని ఇంతకు ముందు సుప్రీంకోర్టు నిర్థిష్ట తీర్పు వెలువరించింది. అయితే దీనిని బేఖాతరు చేస్తూ ఇప్పుడు కేంద్రం సంబంధిత ఆదేశాలు వెలువరించిందని, ఇది సమాఖ్య విధానానికి భంగకరమే కాకుండా , సుప్రీంకోర్టును అగౌరవపర్చడం అవుతుందని ఆప్ తమ పిటిషన్‌లో తెలిపింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యపు ఆప్ ప్రభుత్వం శుక్రవారం ఈ పిటిషన్ దాఖలు చేసింది.
- Advertisement -