న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీని విచ్ఛిన్నం చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని మంగళవారం ఆ పార్టీ మరోసారి పేర్కొంది. పార్టీని వీడి బిజెపిలో చేరేందుకు ఆప్ ఎంఎల్ఏలకు రూ.5 కోట్లు ఆఫర్ చేశారని ‘ఆప్’ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు. ప్రజల ఆదేశానికి ద్రోహం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను, కూటములను కూల్చివేసి బిజెపి ‘ఆపరేషన్ లోటస్’ను ఆచరణలోకి తెస్తోందని భరద్వాజ్ అన్నారు.
ఇదిలావుండగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తనను బిజెపిలోకి లాగడానికి ప్రయత్నించారని, ఆప్ పార్టీని వీడివస్తే తనపై అన్ని కేసులు ఎత్తివేస్తామని తెలిపినట్టు సోమవారం వెల్లడించారు. ఇది రెండు పార్టీల మధ్య వాగ్వాదానికి దారితీసింది.
AAP Chief Spokesperson Shri @Saurabh_MLAgk Addressing an Important Press Conference | LIVE https://t.co/kTVOrP6pjW
— AAP (@AamAadmiParty) August 23, 2022