Monday, December 23, 2024

ఆప్ సిఎం అభ్యర్థి భగవంత్ మాన్ నామినేషన్ దాఖలు

- Advertisement -
- Advertisement -

AAP CM candidate Bhagwant Mann filed nomination

చండీగఢ్ : పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ శనివారం ధురి నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుల సమస్యలను ఆప్ పరిష్కరిస్తుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని వివరించారు. ధురి ప్రజలు తనను ఆదరిస్తారని, భారీ ఆదిక్యతతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్‌లో చరిత్ర సృష్టించవలసిన సమయం ఆసన్నమైందని కేజ్రీవాల్ చెప్పారన్నారు. మాన్ రెండు సార్లు గతంలో లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగ్రూర్ పార్లమెంటు నియోజక వర్గం పరిధి లోని ధురి నుంచి ఇప్పుడు శాసన సభ ఎన్నికలకు పోటీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News