Monday, December 23, 2024

ఇండియా కూటమితోనే ఆప్: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తమ పార్టీ ఇండియా కూటమిలో కొనసాగుతుందని, విడిపోయే ప్రసక్తే లేదని ఆప్ నేత, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. తమ పార్టీ ఈ ప్రతిపక్ష కూటమికి కట్టుబడి ఉంటుందన్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్ రాష్ట్ర విభాగం ఆప్ ప్రభుత్వం తీరు సరిగ్గా లేదని విమర్శలు వెల్లువెత్తాయి. తమ పట్ల ఆప్ వర్గాలు రాజకీయ కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మాదకద్రవ్యాల రవాణా కేసులో ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ అరెస్టు కావడం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ వైఖరిని వెల్లడించారు. పంజాబ్ కేసు, ఎమ్మెల్యే అరెస్టుకు , ఇండియా కూటమి భవితకు ఎటువంటి సంబంధం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News