ఛండీగఢ్: పంజాబ్‌లోని లూదియానా ప్రాంతంలో ఎఎపి కౌన్సిలర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెలర్‌కోట్ల జిల్లా లూధియానాలో మహ్మాద్ అక్బర్ భోలీ(55) అనే కౌన్సిలర్ ఆదివారం తెల్లవారుజామున జిమ్ చేస్తున్నాడు. గుర్తు తెలియని దుండగాలు బ్లాక్ టీ షర్ట్ ధరించి అతి దగ్గరగా వచ్చి తుపాకీతో అక్బర్‌ను కాల్చారు. ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సిసి టివి ఫూటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. 2021 సిర్హిండి గేట్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున 18వ వార్డు కౌన్సిరల్‌గా గెలిచాడు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆప్ పార్టీలో చేరారు. అక్బర్‌కు భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. 2020 జనవర్ 23న అక్బర్ సోదరుడు అన్వర్‌ను గుర్తు తెలియని వ్యక్తి గన్‌తో కాల్చి చంపారు.
జిమ్ చేస్తుండగా ఆప్ కౌన్సిలర్ ను తుపాకీతో కాల్చి
- Advertisement -
- Advertisement -
- Advertisement -