Monday, January 20, 2025

సుప్రీం కోర్టుకు ఆప్ ఢిల్లీ మేయర్ అభ్యర్థి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మేయర్ అభ్యర్థి శైలి ఒబెరాయ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మేయర్‌ను గడువు లోగా ఎన్నుకునేలా చూడాలంటూ ఒబెరాయ్ పిటిషన్ దాఖలు చేశారు. శైలి పిటిషన్‌పై కోర్టు శుక్రవారం విచారించే అవకాశం ఉంది. డిసెంబర్‌లో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగడంతో పాటు ఫలితాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు మేయర్ ఎన్నిక జరగడం లేదు. మేయర్ ఎన్నికల తేదీని జనవరి 9, 24 తేదీల్లో రెండుసార్లు నిర్వహించగా, గందరగోళం కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో శైలి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ 134, బీజేపీ 104, కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News