Sunday, December 22, 2024

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు… ఆప్ నాలుగో జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల చేసింది. మూడు జాబితాల్లో 40 మంది అభ్యర్థులను ఆప్ ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగో జాబితాలో 21 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీంతో ఆప్ అభ్యర్థుల సంఖ్య 61కి చేరింది. జులనా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై ఆప్ అభ్యర్థి కవితా దలాల్ పోటీ చేస్తున్నారు. డబ్ల్యుడబ్ల్యుఇలో కవిత మంచి ప్రదర్శన ఇచ్చారు. 2022లో కవిత ఆప్ లో చేరారు. జులనా నుంచి బిజెపి అభ్యర్థిగా యోగేశ్ బైరాగి పోటీలో ఉన్న విషయం తెలిసిందే. హర్యానా శాసన సభలో 90 స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 5న పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేయాలనుకున్నాయి. కానీ సీట్లు సర్దుబాటు కాకపోవడంతో వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News