Wednesday, January 22, 2025

బాణసంచాపై ఆప్ సర్కారు నిషేధం

- Advertisement -
- Advertisement -

AAP government ban on firecrackers

సుప్రీంకోర్టును ఆశ్రయించిన బిజెపి ఎంపి మనోజ్ తివారి

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్ సర్కారు విధించిన బాణసంచా నిషేధంపై బిజెపి ఎంపి మనోజ్ తివారీ ఆశ్రయించారు. నగరంలో కాలుష్య స్థాయి పెరుగుతుండటంతో కేజ్రీవాల్ సర్కారు అన్ని రకాల బాణసంచా ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు, వినియోగాన్ని నిషేధించింది. ఈనేపథ్యంలో జీవించే సాకుతో ప్రజల మతస్వేచ్ఛను దూరం చేయలేరని ఎంపి తివారి పేరొన్నారు. బాణసంచాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా సుప్రీంకోర్టును కోరారు. ఎంపి మనోజ్ తివారి తరఫున సీనియర్ న్యాయవాది అశ్వినికుమార్ దుబె దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు దీపావళి సందర్భంగా బాణసంచాపై బలవంతంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించాలని సరోన్నత న్యాయాస్థానాన్ని కోరారు. కాగా గతేడాది సుప్రీంకోర్టు బాణసంచాపై నిషేధం లేదని, కేవలం బారియంసాల్ట్ ఉపయోగించిన బాణసంచాపై మాత్రమే నిషేధం ఉందని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News