Saturday, December 21, 2024

‘మోడీ హటావో, దేశ్ బచావో’ ఆప్ పోస్టర్ ప్రచారం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా, 22 రాష్ట్రాల్లో ‘మోడీని తొలగించండి, దేశాన్ని రక్షించండి’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బ్యానర్ ప్రచారాన్ని నేడు చేపట్టింది. ఇది వివిధ భాషల్లో ప్రచారం చేస్తున్నారు. ‘ఆప్’ జాతీయ కన్వీనర్ గోపాల్ రాయ్ తెలిపారు. ఏ వాగ్దానాలు ప్రజలకు చేసి బిజెపి గద్దెనెక్కిందో వాటిలో దేనిని ఇప్పటికీ ఆ పార్టీ పూర్తి చేయలేదన్నారు. ‘ఈ ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతోంది. బిజెపి తన ఏ వాగ్దాన్ని పూర్తి చేయలేదు. సమస్యలు తీర్చడానికి బదులు, ఆ పార్టీ దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉండకుండా చేయాలన్న లక్ష్యంతో ముందుకుపోతోంది. అందుకనే 22 రాష్ట్రాల్లో, ప్రాంతీయ భాషల్లో ఈ ప్రచారం చేపట్టాం’ అని ఆయన వివరించారు.

ఈ ప్రచార పోస్టర్లను ఏప్రిల్ 10న దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అంటిస్తామని, ప్రచారంతో విద్యార్థులను జాగృతం చేస్తామని గోపాల్ రాయ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News