Monday, January 20, 2025

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఊడ్చేస్తున్న ఆప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసిడి) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయపథంలో దూసుకెళ్తోంది. ఈ నెల 4న జరిగిన ఎంసిడి ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా మొదటి నుంచి ఆప్ ఆధ్యికం కనబరుస్తుండగా బిజెపి రెండవ స్థానంలో ఆధిక్యతను చూపుతోంది. ఈ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ ఆశలు అడియాశలయ్యే విధంగా ఫలితాలు కనపడుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు లెక్కించిన ఓట్ల ప్రకారం ఆప్ 84 స్థానాలను కైవసం చేసుకోగా 53 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. బిజెపి 65 స్థానాలను గెలుచుకుని 35 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలను గెలుచుకుని మరో 5 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ ఒక స్థానంలో గెలుపొందింది. ఎంసిడిలో మొత్తం 50 స్థానాలు ఉండగా మెజారిటీ మార్కు సాధించడానికి 126 స్థానాలు గెలుచుకోవలసి ఉంటుంది. గడచిన 15 సంవత్సరాలుగా ఎంసిడిలో బిజెపి అధికారంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News