భోపాల్ : ఢిల్లీ, పంజాబ్‌లో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ (ఆప్) మధ్యప్రదేశ్ సింగ్రౌలీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి 9 వేల మెజార్టీతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. 2014లో తొలిసారి జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన రాణి అగర్వాల్, తాజాగా సింగ్రౌలీ మేయర్‌గా విజయం సాధించారు. సింగ్రౌలీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ తరువాత పెద్ద మున్సిపల్ కేంద్రం సింగ్రౌలీనే. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతోపాటు బొగ్గు, ఖనిజ గనులకు ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా ఉండడంతో కీలకంగా మారింది. సింగ్రౌలీ మేయర్‌గా ఎన్నికైన రాణి అగర్వాల్‌తోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఆప్ నేతలకు ఆమ్‌ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీ రాజకీయాలను దేశవ్యాప్తంగా ప్రజలంతా విశ్వసిస్తున్నారని చెప్పారు.