Monday, December 23, 2024

మిజో బరిలో ఆప్‌ నేతనే సంపన్నుడు

- Advertisement -
- Advertisement -

ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో పోటీదార్లు అత్యధికులు కోట్లకు పడగలెత్తిన వారే ఉన్నారు. 40 స్థానాల అసెంబ్లీలో వివిధ పార్టీలకు చెందిన వారు మొత్తం 174 మంది బరిలో ఉండగా వీరిలో 112 మంది కరోడ్‌పతిలని వెల్లడైంది. కాగా ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన అభ్యర్థి రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఆండ్రూ లాల్రెంకిమా పచూవా వీరిలో అత్యధిక ధనవంతుడిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ 69 కోట్లుగా ఉంది. అభ్యర్థులు నామినేషన్ల దశలో దాఖలు చేసిన అఫడవిట్ల సాయంతో పరిశీలిస్తే పోటీదార్లలో దాదాపు 65 శాతం వరకూ రూ 1 కోటి అంతకు మించిన ఆస్తులతో ఉన్నారు. ఇక ఆప్ నేతదే ఆస్తులలో మిన్న అయింది. పచూవా ఐజ్వాల్ నార్త్ 3 నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.

తరువాతి స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన ఆర్ వంలత్లుంగ రూ 55 కోట్ల ఆస్తులతో ఉన్నారు, ఇక మూడో స్థానంలో జోరమ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌కు చెందిన హెచ్ గిజాలలాలా రూ 37 కోట్ల ఆస్తులతో నిలిచారు. వ్యాపార లావాదేవీలే తమ ఆస్తులకు ఆధారం అని వీరు వివరాలలో తెలియచేసుకున్నారు. కాగా అత్యంత నిరుపేద అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థి రమ్హూలన్ ఎదేనా ఉన్నారు. ఆయన తన చరాస్తుల లెక్క రూ 1500గా ప్రకటించారు. కాగా బిజెపికి చెందిన ఓ అభ్యర్థి తన ఆస్తుల విలువ మొత్తం రూ 90కోట్లు పై చిలుకు అని పొరపాటుగా పేర్కొన్నారు. తరువాత చక్కదిద్దుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News