Saturday, December 21, 2024

ఢిల్లీ ఎల్జీ నివాసం ఎదుట ఆప్ ఆందోళన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నివాసం ఎదుట శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన నిర్వహించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల కంటే ఎల్జీ నామినేట్ చేసిన సభ్యులచేత ముందుగా ప్రమాణస్వీకారం చేయించడంపై ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ నాశనం చేస్తున్నారని ఆప్ ఆరోపించింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎల్జీ నామినేట్ సభ్యులు ఓటు వేసేందుకు చేసేలా కుట్రలో భాగమని ఆప్ విమర్శించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సభ్యులను నామినేట్ చేశారు.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1957 ప్రకారం 10మంది పాలనా నిపుణులను సభ్యులుగా నియమించే అధికారం ఉంది. జనవరి 6న మేయర్ ఎన్నికలకు ముందు వీరిని ఎల్జీ నియమించడంపై ఆప్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నామినేటేడ్ సభ్యులందరూ బిజెపి కార్యకర్తలుగా ఆప్ ఆరోపించింది. ఈనేపథ్యంలో ఆప్ నేతలు, కార్యకర్తలు రాజ్‌నివాస్‌కు అధికసంఖ్యలో చేరుకుని సక్సేనాకు వ్యతిరేకంగా నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News