Sunday, December 22, 2024

నేడు ఆప్ లోక్‌సభ అభ్యర్థుల ఖరారు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం నాడిక్కడ సమావేశం కానున్నది. ఇండియా కూటమితో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే ఆప్ ఢిల్లీ, గుజరాత్, గోవా, హర్యానాలో సీట్ల సర్దుబాటు ఒప్పందాలు చేసుకుంది. పంజాబ్‌లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోరాదని ఆప్ నిర్ణయించింది.

లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం సమావేశం కానున్నదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అస్సాంలో మూడు అభ్యర్థుల పేర్లను, గుజరాత్‌లోని భారూచ్, భావ్‌నగర్ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ఆప్ ఇప్పటికే ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News