- Advertisement -
చండీగఢ్: పంజాబ్‌లోని బటిండకు చెందిన ఆప్ ఎమ్మెల్యే అమిత్ రతన్‌ను లంచం కేసులో బటిండ విజిలెన్స్ బ్యూరో అధికారులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. అయితే దీనిపై విజిలెన్స్ బ్యూరో ఇంకా ప్రకటన చేయవలసి ఉంది. ఘుడ్డా గ్రామ సర్పంచ్ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ బ్యూరో అ అరెస్టు చేసింది.
ఎమ్మెల్యే అనుచరుడిని మాత్రమే అరెస్టు చేసి ఎమ్మెల్యేను విజిలెన్స్ బ్యూరో విడిచిపట్టినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అరెస్టు చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రతన్‌ను అరెస్టు చేయాలని డిమాండు చేస్తూ విజిలెన్స్ బ్యూరో ఆఫీసు వెలుపల గురువారం ధర్న చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు హర్వీందర్ లడ్డీ ఇదివరకే ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఈ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తి రభస చేస్తాయని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -