Saturday, January 11, 2025

తలలో రెండు బుల్లెట్లు… ఆప్ ఎంఎల్‌ఎ గోగీ మృతి

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: పంజాబ్‌లోని లుథియానా వెస్ట్ ఎంఎల్‌ఎ గుర్‌ప్రీత్ గోగీ బస్సీ (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆప్ ఎంఎల్‌ఎ గుర్‌ప్రీత్ గోగీకి శుక్రవారం అర్థరాత్రి బుల్లెట్ తగలడంతో కుటుంబ సభ్యులు దయానంద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గోగీ చనిపోయారని వెల్లడించారు. ఎంఎల్‌ఎ తలలో రెండు బుల్లెట్లు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందని ఎంఎల్‌ఎ కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని డిసిపి కుల్దీప్ సింగ్ చాహల్ తెలిపారు. ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గుర్‌ప్రీత్ 2021లో ఆప్‌లో చేరి లుథియానా వెస్ట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంఎల్‌ఎగా విజయం సాధించారు. లూథియానాలో శుక్రవారం స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్, ఎంపి సంత్ బాబా బల్బీర్ సింగ్ సీచెవాల్‌తో కలిసి  బుద్దానుల్లా స్వచ్ఛత కార్యక్రమంలో గోగీ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News