Monday, December 23, 2024

ఆప్ ఎంపి సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోనానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్‌ను ఢ్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు జడ్జి కె నాగ్‌పాల్ తోసిపుచ్చారు. అంతకుముందు బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా సంజయ్ సింగ్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ సంజయ్ సింగ్‌కు ముడుపులు చెల్లించడం గురించి అప్రూవర్‌గా మారిన నిందితుడు దినేష్ అరోరాతోపాటు ఇతర సాక్షులు పరస్పర భిన్నమైన వాంగ్మూలాలు ఇచ్చారని తెలిపారు.

కాగా బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిందితుడు సంజయ్‌సింగ్‌ను ఇంకా ప్రశ్నించాల్సి ఉందని, ఆయనను విడుదల చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించింది. జంజయ్ సింగ్‌ను ఇడి అక్టోబర్ 4న అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని తయారుచేసి అమలు చేయడంలో సంజయ్ సింగ్ కీలక పాత్ర పోషించినట్లు ఇడి ఆరోపించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News