Friday, December 20, 2024

అవినీతి ఆద్యులు ప్రధాని మోడీనే: సంజయ్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని మోడీనే అవినీతి వ్యవహారాల కీలక ప్రదాత అని ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) వ్యాఖ్యానించింది. దేశంలో అవినీతి పనులకు కర్తకర్మ క్రియ అన్నీ కూడా మోడీనే అని చెప్పడానికి మహారాష్ట్రలో ఇప్పుడు జరిగిన పరిణామాలే తార్కాణం అని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ విమర్శించారు. దేశంలో అవినీతి పనులు యధేచ్ఛగా సాగేలా చేయడానికి మోడీ చర్యలు బాగా దోహదం చేస్తాయని, ఓ వైపు అవినీతిపై పోరు అంటూనే , మరో వైపు అవినీతిని ప్రోత్సహించడం మోడీ నైజం అన్నారు.రెండు మూడు రోజుల క్రితమే ప్రధాని మోడీ అవినీతిపై కఠిన చర్యలు ఉంటాయని భరోసా ఇచ్చారని ,

ఇప్పుడు మహారాష్ట్రలో ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌ను తీసుకున్నారని, ఛగన్ భుజ్‌బల్‌కు మంత్రి పదవి ఇచ్చారని , మరి వీరిపై అవినీతి అభియోగాలు , కేసుల విచారణల సంగతి ఏమైందని, ఇంతకు ముందు వీటిని ప్రధానంగా పదేపదే ప్రస్తావించిన బిజెపి నేతలకు ఇప్పుడు ఇవి గుర్తుకురావడం లేదా? అని ఆప్ నేత నిలదీశారు. అప్పుడు అవినీతిపై పోరు చేసి తీరుతామని మోడీ చెప్పడాన్ని బాగా తెలిపిన టీవీ ఛానల్స్ అన్ని ఇప్పుడు ఆయన అవినీతిని ఖండించాల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News