లక్నో: లక్నోలో బుధవారం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో ఆమ్‌ఆద్మీ పార్టీనేత సంజయ్ సింగ్ సమావేశమయ్యారు. యాదవ్, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు చెందిన జయంత్ చౌదరి లక్నోలో తమ సమావేశానికి చెందిన
ఫోటోలను పోస్ట్ చేశారు. ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకునేది లేదని అఖిలేష్ యాదవ్ ఇటీవల ప్రకటించిన నేపధ్యంలో ఈ భేటీ జరగడం విశేషం. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ పార్టీల మధ్య పొత్తు పూర్తయిన సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో అత్యంత జనాభా కలిగిన యుపి రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా ఉమ్మడి వేదిక కోసం అఖిలేష్ యాదవ్‌తో చర్చలు ప్రారంభించినట్టు సమావేశం అనంతరం ఆమ్ ఆద్మీపార్టీ పేర్కొంది. ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపి సంజయ్‌సింగ్ జులైలో కూడా అఖిలేష్‌తో సమావేశం కావడం బాగా ప్రచారం అయింది. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ మొట్టమొదటిసారి పోటీకి సిద్ధమౌతోంది. ఇటీవల ఈ పార్టీ వరుసగా తిరంగయాత్రలను నిర్వహించింది. ముఖ్యంగా ప్రఖ్యాత అయోధ్య క్షేత్రంలో వీటిని నిర్వహించడం విశేషం. రానున్న రోజుల్లో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ లక్నోలో ర్యాలీ నిర్వహిస్తారు.
అఖిలేష్ యాదవ్‌తో ఆమ్‌ఆద్మీ ఎంపి సంజయ్ భేటీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -