- Advertisement -
న్యూఢిల్లీ : ఆప్ ఎంపి సంజయ్‌సింగ్‌ను సోమవారం ఈ వర్షాకాల సెషన్ ముగిసేవరకూ రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. మణిపూర్ అంశాన్ని ఆయన పదేసభలో ప్రస్తావించడం, ఈ క్రమంలో సభాధ్యక్షుల ఆదేశాలను ధిక్కరించడంతో ఈ చర్యకు పాల్పడ్డారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వెంటనే ఆయన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. ప్రధానమైన అంశంపై గొంతు విప్పితే ఈ విధంగా అణచివేస్తున్నారని, ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
సభలో సింగ్ అరాచకంగా వ్యవహరిస్తున్నారని అంతకు ముందు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని సభ్యుడిని హెచ్చరించారు. అయితే సభ్యుడు మణిపూర్‌పై చర్చకు పట్టు పట్టారు. దీనితో సభానేత పియూష్ గోయల్ సభ్యుడి సస్పెన్షన్‌కు తీర్మానం ప్రవేశపెట్టడం, దీనికి సభ మూజువాణి ఓటుతో ఆమోదం పలకడం జరిగింది.
- Advertisement -