చండీగఢ్: పంజాబ్‌లో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ మున్సిపల్ కౌన్సిలర్ ముహమ్మద్ అక్బర్ దారుణ హత్యకు గురయ్యాడు. మాలెర్‌కోట్ల జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అక్బర్ జిమ్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అతడ్ని అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతని శరీరంలోకి బుల్లెట్ దిగి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. జిమ్‌లోకి ఓ వ్యక్తి వచ్చినట్లు సిసిటివిలో రికార్డయ్యింది. కాల్పులు జరిపాక అగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ హత్యతో ఇద్దరికి సంబంధం ఉందని సిసిటివి ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబ్‌లో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’నే అధికారంలో ఉంది. ఆ పార్టీకే చెందిన మున్సిపల్ కౌన్సిలర్ దారుణ హత్యకు గురవ్వడం ఇక్కడ గమనార్హం.
Punjab: पंजाब में लगातार हो रहा खून-खराबा, अब सत्तारूढ़ AAP के पार्षद की मलेरकोटला में दिनदहाड़े ली गई जानhttps://t.co/Pd1COkZhzP
— Newsroom Post (@NewsroomPostCom) July 31, 2022