Wednesday, January 22, 2025

జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం

- Advertisement -
- Advertisement -

ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనపై ఆప్

న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతింటాయని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆందోళన వ్యక్తం చేసింది. హంగ్ అసెంబ్లీ ఏర్పదితే దాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినట్లవుతుందని ఆప్ అభిప్రాయపడింది. ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ లేఖ రాసిన మరుసటి రోజే ఆ కూటమిలో మరో భాగస్వామ్య పక్షమైన ఆప్ కూడా అదే రీతిలో ఈ ప్రతిపాదనపై శనివారం స్పందించింది.

ఈ ప్రతిపాదన ఫెడరలిజం ఇచ్చే హామీలకు, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని ఆప్ తెలిపింది. ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదన అమలుదాలిస్తే హంగ్ శాసనసభ లేదా పార్లమెంట్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాదని, పార్టీ ఫిరాయింపులు అనే భూతాన్ని ప్రోత్సహించడంతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోలు అమ్మకాలు బహిరంగంగా జరుగుతాయని ఆప్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. జమిలి ఎన్నికలతో ప్రభుత్వ ధనాన్ని ఆదా చేయవచ్చన్న వాదనను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో ఇది కేవలం 0.1 శాతం మాత్రమే ఉంటుందని ఆప్ తెలిపింది. అల్పమైన ఆర్థిక లాభాల కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాంగ, ప్రజాస్వామిక సూత్రాలపై రాజీపడరాదని ఆప్ అభిప్రాయపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News