Monday, December 23, 2024

ఆప్ ఎంపిగా హర్భజన్?

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: పంజాబ్‌లో కొత్తగా కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం తమ పార్టీ తరఫున రాజ్యసభకు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను రాజ్యసభకు నియమించనుంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఢిల్లీలోని ఆప్ వర్గాల సమాచారం. తాజా ఎన్నికల్లో ఎమ్‌ఎల్‌ఎల సంఖ్యాబలం ప్రకారం ఆప్‌కు కొత్తగా రెండు రాజ్యసభ బెర్తులు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే హర్భజన్‌సింగ్ ను పెద్దల సభకు పంపాలని పార్టీ కేంద్ర కార్యవర్గం నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయబోయే జలంధర్ స్పోర్ట్ యూనివర్శిటీ బాధ్యతలను కూడా హర్భజన్ సింగ్‌కు అప్పచెప్పాలని భావిస్తున్నారు.

AAP Party likely to send Harbhajan Singh to Rajya Sabha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News