Monday, December 23, 2024

గోవాలో రాష్ట్ర పార్టీగా ఆప్‌కు గుర్తింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గోవాలో రాష్ట్ర పార్టీగా ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) గుర్తింపు పొందింది. గత ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై సమీక్ష అనంతరం ఎన్నికల కమిషన్ నుంచి తమకు రాష్ట్ర పార్టీ హోదా లభించినట్టు ఆప్ తెలియజేసింది. ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలో కూడా ఉంది. ఢిల్లీ, పంజాబ్ తరువాత గోవాలో కూడా రాష్ట్ర పార్టీగా ఆప్ గుర్తింపు పొందిందని ఈమేరకు ఎన్నికల సంఘం నుంచి తమకు సమాచారం అందిందని కేజ్రీవాల్ చెప్పారు. మరో రాష్ట్రంలో గుర్తింపు పొందితే అధికారికంగా జాతీయ పార్టీగా ఆప్‌ను ప్రకటిస్తారని కేజ్రీవాల్ తెలిపారు.

AAp party recognised as state party in Goa by EC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News