Sunday, December 22, 2024

రాజ్యసభకు ఆప్ అభ్యర్థుగా సంజయ్ సింగ్ నామినేషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చీఫ్ స్వాతి మాలివాల్, ఆప్ ఎంపీలు సంజయ్‌సింగ్, ఎన్‌డి గుప్తా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికలు జనవరి 19 న జరగనున్నాయి. స్వాతి మాలివాల్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ఆప్ శుక్రవారం నియమించగా, రాజ్యసభకు అభ్యర్థులుగా రెండోసారి సంజయ్‌సింగ్, ఎన్‌డి గుప్తాలను ప్రతిపాదించింది. సంజయ్‌సింగ్ , ఎన్‌డి గుప్తాల ఆరేళ్ల రాజ్యసభ పదవీకాలం జనవరి 27తో పూర్తి అవుతుంది. సుశీల్ గుప్తా స్థానంలో స్వాతిమాలివాల్ అభ్యర్థిత్వాన్ని ఆప్ ప్రతిపాదించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉన్న ఆప్‌నేత సంజయ్‌సింగ్ సోమవారం జైలు నుంచి భారీభద్రత మధ్య ఢిల్లీలోని సివిల్ లైన్స్‌కు తమసహచర నేతలు స్వాతిమాలివాల్ , ఎన్డీ గుప్తాలతో కలిసి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభకు నామినేషన్ వేసేందుకు సంజయ్ సింగ్ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. నామినేషన్ దాఖలు తరువాత స్వాతిమాలివాల్ మాట్లాడుతూ సాధారణ మహిళ వంటి తనను రాజ్యసభకు పంపించాలనుకోవడంపై ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. డిసిడబ్లు ఛైర్‌పర్మన్‌గా ఎనిమిదేళ్ల కాలంలో 1,70, 000 కేసులను పరిష్కరించినట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News