Friday, December 20, 2024

అవినీతిపై కేజ్రీవాల్ యుద్ధాన్ని సిబిఐ ఆపలేదు: ఆప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సిబిఐ శుక్రవారం సమన్లు పంపడంపై ఆప్ స్పందించింది. కేజ్రీవాల్ అవినీతిపై చేస్తున్న యుద్ధాన్ని సమన్లు నిలువరించలేవని ఆప్ నేతలు పేర్కొన్నారు. కేజ్రీవాల్ అదానీ సమస్యపై మాట్లాడటం వల్లే సిబిఐ నోటీసులు జారీ చేసిందని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా రాజ్యసభ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు పన్నిన కుట్రలో భాగంగా సిబిఐ సమన్లు జారీ చేసిందన్నారు. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో భాగంగా చారణకు ఈ నెల హాజరుకావాలని సిబిఐ కేజ్రీవాల్‌ను కోరింది ఈ మేరకు సమన్లు జారీ చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయంలో 16వ తేదీ ఉదయం 11గంటలకు హాజరవ్వాలని సమన్లులో పేర్కొన్నట్లు సిబిఐ అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఢిల్లీ శాసనసభలో సిఎం కేజ్రీవాల్ అదానీ సమస్యపై ప్రసంగించిన రోజే సిబిఐ నుంచి పిలుపువచ్చిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం అవినీతిమయం అని, కేజ్రీవాల్ ఈ నెల సిబిఐ ఎదుట హాజరవుతారని ఆప్ సీనియర్ నేత సంజయ్‌సింగ్ వెల్లడించారు. కాగా సిబిఐ ఇప్పటికే ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సిఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News